‘నన్ను దోచుకుందువటే’ సినిమా రివ్యూ..!

21 September, 2018 - 4:33 PM

సినిమా పేరు: నన్ను దోచుకుందువటే
జానర్: రొమాంటిక్‌ ఎంటర్‌‌టైనర్‌
నటీనటులు: సుధీర్‌‌బాబు, నభ నటాషా, నాజర్‌, తులసి, వైవా హ‌ర్ష, వేణు, సుద‌ర్శన్‌, గిరి త‌దిత‌రులు
సంగీతం: అజనీష్‌ లోక్‌‌నాథ్
దర్శకత్వం: ఆర్‌ఎస్‌ నాయుడు
నిర్మాత: సుధీర్‌‌బాబు
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్‌
కొరియోగ్రాఫర్‌: రాజ్‌‌కృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణ కుటుంబం నుంచి టాలీవుడ్‌కు పరిచయమైన యంగ్ హీరో సుధీర్‌‌బాబు ప్రత్యేకమైన ఇమేజ్‌ కోసం కష్టపడుతున్నాడు. తెలుగుతో పాటు బాలీవుడ్‌‌లో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ చార్మింగ్ హీరో మల్టీస్టారర్‌ సినిమాలతో పాటు ప్రతినాయక పాత్రలకు కూడా సై అంటున్నాడు. క‌థ‌ల ఎంపిక‌లో సుధీర్‌బాబుకి మంచి అభిరుచి ఉంది. ఆ విష‌యం ప‌లుమార్లు రుజువైంది కూడా. ‘స‌మ్మోహ‌నం’తో మంచి విజ‌యం అందుకుని జోరుమీదున్న సుధీర్‌బాబు నిర్మాణంలోకి అడుగుపెట్టాడు.

ఈ క్రమంలో తొలి ప్రయ‌త్నంగా ‘న‌న్ను దోచుకుందువటే’ మూవీని సుధీర్‌బాబు నిర్మించాడు. ఆర్‌.ఎస్‌.నాయుడిని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేశాడు. హీరోగా, నిర్మాత‌గా రెండు బాధ్యత‌లు భుజాన వేసుకుని సినిమా చేసిన సుధీర్‌‌బాబుకి ‘న‌న్ను దోచుకుందువ‌టే’ ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో.. ఈ యంగ్ హీరో ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం?స్టోరీ:
కార్తీక్‌ (సుధీర్‌‌బాబు) ఓ సాప్ట్‌‌వేర్‌ కంపెనీలో మేనేజర్‌. పని విషయంలో స్ట్రిక్ట్‌‌గా ఉండే కార్తీక్‌ అంటే ఆఫీస్‌‌లో ఉద్యోగులందరికీ భయం. ఎప్పుడు ఎవరిని ఉద్యోగం నుంచి తీసేస్తాడో అని అంతా భయపడుతూ పనిచేస్తుంటారు. ఎప్పటికైనా కంపెనీలో ప్రమోషన్‌ సాధించి అమెరికా వెళ్లాలని, తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని ఆశయం పెట్టుకుంటాడు కార్తీక్‌. ఆ కలను నిజం చేసుకునేందుకు ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా కష్టపడుతుంటాడు. ఇంత‌లో మేన‌మామ కూతురు స‌త్య (వర్షిణి)తో పెళ్లి చేయాల‌నుకుంటారు. కానీ స‌త్య కోరిక మేర‌కు కార్తీక్ సిరి అనే అమ్మాయిని ప్రేమించాన‌ని తన తండ్రి(నాజర్‌)తో అబ‌ద్ధం చెప్పాల్సి వ‌స్తుంది. దీంతో సిరిని కలిసేందుకు కార్తీక్‌ తండ్రి నాజర్ హైదరాబాద్‌ వస్తాడు.

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో షార్ట్‌ ఫిలింస్‌‌లో నటించే ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ మేఘన (నభ నటేష్‌)ను తన గర్ల్‌ ఫ్రెండ్‌‌గా నటించేందుకు ఒప్పందం చేసుకుంటాడు కార్తీక్‌. కానీ మేఘన మంచితనం, ప్రేమ నచ్చి వారిద్దరి పెళ్లికి నాజర్ అంగీకరిస్తాడు. అదే సమయంలో కార్తీక్‌‌కి కూడా మేఘన మీద ఇష్టం కలుగుతుంది. మేఘన కూడా కార్తీక్‌‌ను ఇష్టపడుతుంది. కానీ మేఘనతో ఎక్కువ సమయం గడుపుతుండటంతో కార్తీక్‌‌కు ఆఫీస్‌‌లో ఓ సమస్య ఎదురవుతుంది. దీంతో తన లక్ష్యానికి దూరమవుతున్నాననే భయంతో మేఘనను దూరం పెడతాడు. అదే సమయంలో మేఘనకు దూరమవుతున్నందుకు బాధపడుతుంటాడు. చివరికి కార్తీక్‌ ఏ నిర్ణయం తీసుకున్నాడు? గోల్‌ కోసం మేఘనను వదులుకున్నాడా? లేక మేఘన కోసం గోల్‌‌ను పక్కన పెట్టాడా? అనేదే తరువాతి కథ.ఎవరెలా చేశారంటే..:
సుధీర్‌‌బాబు నిర్మాతగా మారేందుకు పర్ఫెక్ట్‌‌గా తన బాడీ లాంగ్వేజ్‌‌కు తగ్గ కథను ఎంచుకున్నాడు. తన ఇమేజ్‌‌కు తగ్గట్టుగా రొమాంటిక్‌ కామెడీతో అలరించాడు. సీరియస్‌‌గా ఉంటూనే ఆడియన్స్‌‌ను నవ్వించటంలో సక్సెస్‌ అయ్యాడు. ఎమోషనల్‌ సీన్స్‌‌లోనూ మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా ఆఫీస్‌‌లో ఎంప్లాయీస్‌‌ను టార్చర్‌ పెట్టే సీన్స్‌‌లో సుధీర్‌ నటన సూపర్బ్‌. హీరోయిన్‌‌గా పరిచయం అయిన నబా నటేష్‌ బబ్లీ గర్ల్‌‌గా ఆకట్టుకుంది. నభకు తొలి సినిమాలోనే మంచి వేరియేషన్స్‌ చూపించే అవకాశం దక్కింది. నటన పరంగా పరవాలేదనిపించిన నభ, కామెడీ టైమింగ్‌‌తో ఆకట్టుకుంది. హీరో తండ్రి పాత్రలో నాజర్‌ ఒదిగిపోయారు. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్‌ సీన్స్‌‌లో నాజర్‌ నటన కంటతడి పెట్టిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో పృథ్వీ, తులసీ, సుదర్శన్‌ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.విశ్లేషణ:
ప్రేక్షకుల‌కు సుప‌రిచిత‌మైన క‌థే నన్ను దోచుకుందువటే. కానీ వ‌ర్తమాన ప‌రిస్థితుల్ని ప్రతిబింబించే స‌న్నివేశాలు, పాత్రల‌తో చిత్రంలో కొత్తద‌నం క‌నిపించేలా చేశారు. వాస్తత ఉట్టిప‌డేలా, స‌ర‌దాగా సాగేలా స‌న్నివేశాల్ని రాసుకోవ‌డం.. వాటిని అంతే ప‌క‌డ్బందీగా తెర‌పై చూపించ‌డంలో ద‌ర్శడు స‌ఫ‌ల‌మ‌య్యాడు కార్తీక్ ఆఫీస్‌‌ వాతావ‌ర‌ణాన్ని, మేఘ‌న షార్ట్‌ షాల్మ్ హంగామాని తెర‌పై చూపించిన విధానం, అక్కడ పండిన హాస్యంతో తొలి స‌గ‌భాగం సినిమా స‌ర‌దాగా సాగిపోతుంది. ద‌ర్శకుడికి హాస్యంపై మంచి ప‌ట్టు ఉంద‌ని చాలా స‌న్నివేశాలు నిరూపిస్తాయి. సుధీర్‌బాబు, నభా న‌టేష్‌‌ల నటన ఆక‌ట్టుకుంటుంది. సినిమా వాళ్లిద్దరి చుట్టూనే తిరుగుతుంది.

సినిమా రెండో సగంలో క‌థ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగే అవ‌కాశం ఉన్నా, మంచి డ్రామాకి చోటున్నా.. ద‌ర్శకుడు అటువైపు దృష్టిపెట్టలేదు. దాంతో చాలా స‌న్నివేశాలు సాగ‌దీసినట్లు అనిపిస్తాయి. కథనం ఇంకాస్త వేగంగా ఉంటే బాగుండుననిపిస్తుంది. ప్రేక్షకుడి ఊహ‌కు అందిపోతూ.. ఆస‌క్తి కోల్పోయేలా చేస్తాయి. ప‌తాక స‌న్నివేశాల్లో సెంటిమెంట్ బాగా పండింది. క‌థానాయిక పాత్రని రాసుకోవ‌డంలో కొన్ని లోపాలు క‌నిపిస్తాయి.అజనీష్‌ లోక్‌‌నాథ్‌ సంగీతం కూడా సినిమాకు పర్ఫెక్ట్‌‌గా సెట్ అయ్యింది. పాటలు పరవాలేదనిపించినా, నేపథ్య సంగీతం సీన్స్‌‌ను మరింత ఎలివేట్ చేసింది. సురేష్‌ సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. ఎడిటింగ్‌ నిరాశపరిచింది. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగటం సినిమాకు మైనస్‌ అయింది. సురేష్ ర‌గుతు కెమెరా ప‌నిత‌నం బాగుంది. నిర్మాత‌గా కూడా సుధీర్‌బాబు తొలి ప్రయ‌త్నంలోనే త‌న‌ అభిరుచిని చాటిచెప్పాడు. సినిమా స్థాయికి త‌గ్గట్టుగా నిర్మాణ విలువ‌లు క‌నిపిస్తాయి. సుధీర్‌‌బాబు సొంత సినిమా కావటంతో ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీ అవుట్‌‌పుట్‌ ఇవ్వడానికి కష్టపడ్డాడు.

బలాలు:
సుధీర్‌‌బాబు క్యారెక్టర్‌
హీరో హీరోయిన్ల కామెడీ
ఎమోషనల్‌ సీన్స్‌
తొలి సగభాగం
బలహీనతలు:
నెమ్మదిగా సాగే కథనం
ద్వితీయార్థంలో సాగ‌దీత‌
ప్రేక్షకుడి ఊహ‌కు అందేలా స‌న్నివేశాలు