అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌కు అస్వస్థత

13 September, 2017 - 2:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నెల్లూరు : అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే అస్వస్థతకు గురయ్యారు. ఓ మొబైల్ షోరూమ్ ఓపెనింగ్ కోసం నెల్లూరు వెళ్లినా షాలిని అక్కడ కార్యక్రమం మధ్యలోనే అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. షాపు యాజమాన్యం వెంటనే ఆమెను బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో స్ట్రైచర్ పై తీసుకెళ్లే సమయంలో శరీరంపై తెల్లటి వస్త్రం కప్పి ఉంచారు. ముఖం కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రెండు గంటల చికిత్స, అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు ఆమె సన్నిహితవర్గాలు తెలిపాయి.