మూడోసారి…

13 April, 2019 - 5:23 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కుతోంది. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమం శనివారం రామానాయుడు స్టూడియోలో జరిగింది.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 24వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరగనుంది.ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో హీరోగా అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే.ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

తాజాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ సరసన  దువ్వాడ జగన్నాథం చిత్రంలో పూజా హేగ్డే నటించిన విషయం విదితమే. ఇక ఈ చిత్రాన్ని హరికా, హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. నిర్మాతలుగా అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో టబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రాధాకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.