‘స్పైడర్’ ప్రీరిలీజ్ బిజినెస్ డిమాండ్

06 September, 2017 - 10:28 AM


తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న ‘స్పైడర్’ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళం భాషలలో రూపొందుతున్న ఈ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరుగుతోందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కృష్ణా జిల్లా హక్కులు 5.4 కోట్లకు అమ్ముడైనట్లుగా సమాచారం.
హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని రెండు పాటలను ఇటీవలే విడుదల చేసారు. స్టైలిష్, వెస్ట్రన్ స్టైల్లో ఈ పాటలు కొనసాగుతున్నాయి. ఇందులో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో మహేష్ నటిస్తున్నాడు. ఎస్‌జె సూర్య, భరత్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.