‘స్పైడర్’ ఆడియో వేడుకలో మార్పులు?

31 August, 2017 - 11:04 AM


సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పైడర్’ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9న తమిళ, తెలుగు వర్షన్స్‌కు సంబంధించిన పాటలను ఒకే వేదికపై విడుదల చేయాలని చిత్ర దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ వేడుకకు తమిళ, తెలుగు ఇండస్ట్రీలకు చెందిన ఇద్దరు స్టార్ డైరెక్టర్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించబోతున్నారని తెలిసింది.

మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్. ఎస్.జె. సూర్య, భరత్ నెగెటివ్ పాత్రలలో నటిస్తున్నారు. హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన బూం బూం పాట, మరియు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెప్టెంబర్ 27న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.