ఐదో వన్డే: భారత్ బ్యాటింగ్

13 February, 2018 - 4:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

పోర్ట్‌ ఎలిజబెత్‌: టీమిండియా పర్యటనలో భాగంగా జరుగుతున్న ఆరు వన్డేల సీరీస్‌లో మంగళవారం ఇక్కడ మొదలైన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి, ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ మర్కరమ్‌ తొలుత టీమిండియాను బ్యాటింగ్‌‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌‌లో భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా, సఫారీ జట్టులో ఒక మార్పు జరిగింది. క్రిస్‌ మోరిస్‌ స్థానంలో షమ్సి తుది జట్టులోకి వచ్చాడు.

ఇంతవరకూ 3–1తో తేడాతో ముందంజలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌‌లో గెలిస్తే సీరీస్‌ సొంతం కావడంతో పాటు నంబర్‌ వన్‌ ర్యాంక్‌ కూడా సుస్థిరం అవుతుంది. సొంత గడ్డపై సీరీస్‌ కాపాడుకునే ప్రయత్నంలో నాలుగో మ్యాచ్‌‌‌లో రాణించిన సఫారీ జట్టు అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది.

ఈ రోజు మ్యాచ్‌‌కి వరుణుడు అడ్డు తగులుతాడని భావించినప్పటికీ వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆటమొదలైంది.

దక్షిణాఫ్రికా జట్టు: అయిడెన్‌ మార్ర్కమ్‌, హషీమ్‌ ఆమ్లా, జేపీ డుమిని, ఏబీ డివిలియర్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, అండిలె ఫెలుక్‌‌వాయో, రబాడ, లుంగి ఎంగిడి, మోర్నీ మోర్కెల్‌, తబ్రైజ్‌ షంషీ.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌, ఎంఎస్‌ ధోనీ, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌‌దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా.