మీడియా పల్స్ : శోభన్ బాబు భార్యపై చౌకబారు కామెంట్లు చేస్తే…

11 September, 2017 - 5:54 PM

నిన్న ఉదయం ఒక వార్తాంశాన్ని ‘ది హన్స్ ఇండియా’ పత్రికలో చూశాను. అలాగే నిన్న రాత్రి మరొక అంశాన్ని ఫేస్‌బుక్‌లో పరికించాను. ఈ రెండు అంశాలూ ఒకే చోట చర్చించడంలో ప్రత్యేకత ఏమని మీకు సందేహం వచ్చి ఉంటుంది. అవునా! ఖచ్చితంగా రావాలి కూడా.

‘ప్రెస్‌ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ ప్రధాన సంపాదకులు విజయ్ జోషీ గారు శుక్రవారం రోజున ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం శాఖలో, ‘జర్నలిజంలో నడుస్తున్న ధోరణు’ల గురించి మాట్లాడారు. హిందూ, క్రానికల్, ఎక్స్‌ప్రెస్ పత్రికలలో ఈ అంశం కనబడలేదు కానీ, ది హన్స్ ఇండియాలో మూడు కాలమ్‌ల వార్తగా ఫొటోతో పాటు ప్రచురించారు. గతంలో కేవలం ఉత్తరాల ద్వారా పాఠకుల అభిప్రాయాలు తెలపడం ఉండేది. అయితే నేడు సోషల్ మీడియా అనేది ప్రధాన స్రవంతి మీడియాకు పరీక్షా వేదిక, చర్చా వేదిక అయిందని ఆయన ప్రస్తుతించారు. ప్రధాన స్రవంతి మీడియా విశ్వసనీయతను కోల్పోయిందనీ, నియమాలను అతి క్రమించడం, కొన్ని కథనాలను ప్రచురించకుండా జాగ్రత్త పడడం వంటివి ఇదే కోవలోకి వస్తాయని వివరిం చారు. మీడియాకు ఉద్యోగపరమైన బద్దకం ఎక్కువయి జర్నలిజానికి ప్రతీఘాతమ వుతోందని కూడా అన్నారు. విలేఖరులు, సంపాదకవర్గం మధ్య విశ్వాసం లేకపోతే వారు మరో ఉద్యోగానికో, ఉపాధికో తరలి వెళ్లడం మంచిదని కరుకయిన సలహా ఇచ్చారు. నిజానికి మిగతా పత్రికలు కూడా దీనికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించి ఉండాల్సింది.

రామలక్ష్మి గారు ఆమెను అలా గమిడి గేదె అనడం ఖచ్చితంగా తప్పే అని వారంతా పేర్కొన్నారు. సమ్మెట ఉమాదేవి గారయితే ఇంకొంచం ముందుకు వెళ్లి తెలకపల్లి రవి గారు పరిచయం లోనే ఖండించి ఉండాల్సింది లేదా అసలు ఆ కార్యక్రమాన్ని బయటకు రాకుండా ఆపి ఉండాల్సింది అని సూచించారు.

కె రామలక్ష్మి

సోషల్ మీడియా పరీక్షా వేదిక అన్న విజయ్ జోషీ భావనకు ఉదాహరణ లాంటి మరో విషయాన్ని అదే రోజు రాత్రి గమనించాను. అదేమిటంటే ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి గారిని పాత్రికేయుడు తెలకపల్లి రవి చేసిన ఇంటర్వ్యూ. ఆ వీడియోను నేను ఫేస్‌బుక్‌లో మధ్యాహ్నమో సాయంకాలమో చూశాను. నటుడు శోభన్‌బాబు, నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మధ్య ప్రేమ గురించి వ్యాఖ్యానిస్తూ రామలక్ష్మి గారు, శోభన్‌బాబు భార్య గురించి చాలా చౌకబారుగా మాట్లాడారు. దీనిని ఖండిస్తూ, దూరదర్శన్‌లో చాలాకాలం వార్తలు చదివిన విజయదుర్గ గారు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. రాత్రి పదిన్నర తర్వాత వారు దీనిని పోస్టు చేశారు. సుమారు పన్నెండు గంటల వ్యవధిలో 280 మంది స్పందించారు. స్పందించడం కాదు, గట్టిగా ఖండించారు. రామలక్ష్మి గారు ఆమెను అలా గమిడి గేదె అనడం ఖచ్చితంగా తప్పే అని వారంతా పేర్కొన్నారు. సమ్మెట ఉమాదేవి గారయితే ఇంకొంచం ముందుకు వెళ్లి తెలకపల్లి రవి గారు పరిచయం లోనే ఖండించి ఉండాల్సింది లేదా అసలు ఆ కార్యక్రమాన్ని బయటకు రాకుండా ఆపి ఉండాల్సింది అని సూచించారు.

మామూలుగా పత్రికలలో, రేడియాలో, టెలివిజన్‌లో ఒక అంశం గురించి 280 మంది స్పందించే అవకాశం ఉండదు. ఖండించే వీలు అసలే ఉండదు. ఇదే విజయ్ జోషీ పేర్కొన్న స్క్రూటినైజర్ పాత్ర. ఇక్కడ ఈ పాత్రను ఫేస్‌బుక్‌ ఘనంగా పోషించింది. ఫలితంగా కె. రామలక్ష్మి గారు ముందు ముందు ఇలా మాట్లా డకుండా జాగ్రత్త పడతారనీ, అలాగే తెలకపల్లి రవి గారు ఇలాంటి సందర్భాలలో మరింత గంభీరంగా వ్యవ హరిస్తారనీ మనం భావించాలి. ఆసక్తి ఉన్న వాళ్లు హన్సిండియా వెబ్‌సైట్‌లో social media.. a scrutinizer for main stream media: pti chief అనే అంశాన్నీ, vijayadurga అని ఫేస్‌బుక్‌లో సెప్టెంబరు తొమ్మిదవ తేదీ రాత్రి 8.23కు చేసిన పోస్టునూ, దానికి లభించిన స్పందననూ చూడవచ్చు.

  • – డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
    మీడియా విశ్లేషకులు