ఇదిగో సీత …

21 May, 2019 - 7:03 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం సీత. ఈ చిత్రం మే 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. విడుదలైన కొద్ది సేపటికే ఈ ట్రైలర్ దూసుకుపోతుంది.

ఈ చిత్రంలో రౌడీతో కాజల్ ఫైట్ చేస్తున్న సీన్ అందరిని ఆకట్టుకుంది. నా పేరు రఘురామ్.. సీత మా మామయ్య కూతురు. నేను సీతను చూసుకోవాలి. సీత నన్ను చూసుకోవాలని మామయ్య చెప్పారంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పై డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో నిజంగా ఫైట్స్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో కాజల్ పేర్కొన్నారు. ఈ ఫైట్స్ చేస్తున్న క్రమంలో గాయపడ్డానని ఆమె తెలిపారు కూడా.