నా డ్రీమ్‌ అదే..!

13 June, 2017 - 5:08 PM

video

సింగర్ లిప్సిక ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి!

ప్లేబ్యాక్ సింగర్‌ గా మ్యూజిక్ ప్రియులను అలరిస్తోన్న లిప్సిక. న్యూవేవ్స్‌ ఇంటర్వూలో ఆసక్తికరమైన విషయాలను చెప్పింది.  చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల  బలవంతం మీద సంగీతం నేర్చుకున్నానని ఇప్పుడదే తనకు గుర్తింపును తెచ్చిపెట్టడం ఓ రకంగా ఆనందంగా, ఆశ్చర్యంగా కూడా ఉందంటోంది లిప్సిక.

పాటలు పాడిన వాళ్ల పేర్లు ఆల్బమ్స్‌లో వేయకుండా ఇతర గాయనీ గాయకుల పేర్లు వేయడం మాములేనంటోన్న లిపిక్స ఆ అనుభవం తనకు ఎదురైందంటోంది. ప్రస్తుతం కర్నాటక, హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటున్నానని చెబుతున్న లిప్సిక డబ్బింగ్‌ ఆరిస్ట్‌ గా తొలి చిత్రం కుమారి 21ఎఫ్‌ తోనే గుర్తింపు రావడం మర్చిపోలేని అనుభూతి అంటోంది.

తన తాత, తండ్రి ఆశయమైన మ్యూజిక్ స్కూల్‌ ని ఏర్పాటు చేయడమే తన ముందున్న లక్ష్యమని చెబుతోంది లిప్సిక.