శర్వాకి గాయం

16 June, 2019 - 6:52 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: టాలీవుడ్ హీరో శర్వానంద్‌ గాయపడ్డారు. తమిళ్ సినిమా 96 రీమేక్‌లో శర్వానంద్ నటిస్తున్నారు. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ థాయ్‌లాండ్‌ వెళ్లింది. అయితే అక్కడ శిక్షకుల సమక్షంలో శర్వానంద్ స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన కాళ్లపై ల్యాండ్ కావాల్సి ఉండగా భుజాలను మోపి శర్వానంద్ ల్యాండ్ అయ్యారు.

దీంతో శర్వానంద్ భుజం (గూడు) జారీంది. దాంతో 96 షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసి.. శర్వానంద్‌ను హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆపరేషన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత వారం రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే టాలీవుడ్‌ హీరోలకు వరుసుగా ప్రమాదాల భారీన పడుతున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ ఇటీవల కారు ప్రమాదం నుంచి తృటీలో తప్పించుకున్నారు. అలాగే నాగ శౌర్య, సందీప్ కిషన్ కూడా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురైన విషయం విదితమే.