జయసుధ ఇంట పెళ్లి బాజా

12 September, 2019 - 4:06 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్ : సహజ నటి జయసుధ పెద్ద కుమారుడు నిహార్ కపూర్ వివాహానికి ముహుర్తం ఖరారు అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్‌తో నిహర్ వివాహం జరగనుంది. అమ్రిత్ కౌర్ ..  న్యూఢిల్లీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయసుధ ఆమె పెద్ద కుమారుడు నిహార్ కపూర్‌తో కలసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

జయసుధ చిన్న కుమారుడు శ్రేయన్ కపూర్ నటుడు, అంతేకాదు జాతీయ స్థాయి షూటర్ కూడా. గతంలో శ్రేయన్ హీరోగా బస్తీ అనే టాలీవుడ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. దాంతో శ్రేయన్.. అటు సినిమాలు.. ఇటు షూటర్‌గా చేయడం కాదని భావించారు. ఆ క్రమంలో తన కెరీర్‌ను షూటర్‌గా ఎంచుకున్నాడంటూ జయసుధ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక జయసుధ భర్త నిర్మాతగా నితీన్ కపూర్ అందరికి సుపరిచితులు. 2017లో ఆయన ముంబయిలో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.