‘సర్కార్’ సరికొత్త రికార్డు

08 November, 2018 - 4:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

 చెన్నై: ప్రముఖ నటుడు విజయ్ నటించిన చిత్రం సర్కార్. మంగళవారం విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రంతో విజయ్ ప్రముఖ దర్శకుడు బాహుబలి 2 సినిమా తొలి రోజు వసూళ్లను అధిగమించింది.

విదేశాల్లో కూడా విడుదలైన ఈ చిత్రం దూసుకువెళ్తున్న సంగతి తెలిసిందే. ఏ.ఆర్.మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం విదితమే. విజయ్ సరసన కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూర్చారు. మురుగుదాస్ – కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ఇది.