సానియా- షోయబ్ పవిత్ర యాత్ర

16 May, 2018 - 11:25 AM

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, ఆమె భర్త, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌‌తో పాటు తల్లిదండ్రులతో కలసి పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లారు. మొదట యూఏఈ చేరుకున్న సానియా దంపతులు అక్కడి నుంచి సౌదీ అరేబియా చేరుకున్నారు. తాను తల్లి కాబోతున్న విషయాన్ని గత నెలలో సానియా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. పుట్టబోయే బిడ్డకు అల్లా దీవెనల కోసమే సానియా దంపతులు ఈ పవిత్ర యాత్ర చేస్తున్నట్టు సమాచారం.

ముస్లింల పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభానికి ముందే సానియా తన కుటుంబ సభ్యులతో కలసి ఉమ్రా యాత్రకు వెళ్లిన ఫొటోలను షోయబ్‌ మాలిక్ తన ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్‌ చేశాడు. ‘క్యూట్‌ కపుల్‌’, ‘అల్లా దీవెనలు మీకు ఉంటాయి’.. అంటూ ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.