అదరగొట్టిన ‘అల్లుడు’

14 September, 2018 - 2:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నాగ చైతన్య, అను ఇమ్మానియేల్ జంటగా నటించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రం సెప్టెంబర్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన శైలజారెడ్డి అల్లుడు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓపెనింగ్స్ రాబట్టుకుంది. నాగ చైతన్య కెరీర్‌లో ఈ చిత్రం హయ్యస్ట్ ఓపెనర్‌గా నిలవడంలో శైలజారెడ్డి అల్లుడు సక్సెస్ అయ్యాడు.

గురువారం పండగ సెలవు కారణంతో ఈ మూవీకి సమంతా యుటర్న్ తప్ప పెద్దగా పోటీ లేకపోవడం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి రోజు షేర్ సుమారు రూ. 5.50 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ సమాచారం. విడుదలైన చిత్రాల ప్రకారం చూసుకుంటే నాగ చైతన్య నటించిన ఈ చిత్రం భారీ ఎత్తున విడుదలైంది. ఏరియా వారీగా సైతం నాగ చైతన్య తన వరకు కొత్త రికార్డ్స్ అందుకున్నాడు.
నైజామ్ : రూ. 1.69 కోట్లు
సీడెడ్ : రూ. 81 లక్షలు
ఉత్తరాంద్ర : రూ. 60 లక్షలు
గుంటూరు: రూ. 59 లక్షలు
తూర్పు గోదావరి : రూ. 72 లక్షలు
పశ్చిమ గోదావరి : రూ. 41 లక్షలు
కృష్ణా : రూ. 40 లక్షలు
నెల్లూరు: రూ. 23 లక్షలు
తెలుగు రాష్ట్రాలు మొత్తం 1 రోజు షేర్ : రూ. 5.45 కోట్లు

అయితే ఇది అధికార సమాచారం కాకున్నా ట్రేడ్ నుంచి అందిన నివేదిక ఆధారంగా చూస్తే చైతన్య మంచి వసూళ్లు అందుకున్నాడనే చెప్పాలి. మరోవైపు సమంతా నటించిన చిత్రం యూటర్న్ . ఇది సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. ఈ నేపథ్యంలో మాస్ ఆడియన్స్ ఎక్కవగా నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడకే కనెక్ట్ అవుతారని.. ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.