ట్రైలర్‌కి ‘సాహో’

10 August, 2019 - 5:29 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్ర ట్రైలర్ శనివారం విడుదల చేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ. 300 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి జీబ్రాన్ స్వరాలు అందించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో అంటే ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రానికి కథని కూడా దర్శకుడు సుజీత్ అందించారు. నీల్ నితిన్ ముఖష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే వ్యూస్ లక్షల్లో దూసుకుపోతుంది.

బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంపై ప్రభాస్ ఫ్యాన్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అసలు అయితే ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కావాల్సి ఉంది. అయితే నిర్మాణానంతర పనులు వల్ల ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల చేస్తామని యూవీ క్రియేషన్స్ ప్రకటించిన విషయం విదితమే.