తొలి సాంగ్‌కి ‘సాహో’

08 July, 2019 - 5:47 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో ని తొలి పాట మొత్తం వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సైకో సయ్యాన్ .. అంటూ సాగే ఈ పాట ప్రబాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని తొలి పాట టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలోని నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే అరుణ్ విజయ్, చుంకి పాండే, జాకీ షరాఫ్, ముఖేష్ మంజ్రేకర్, మందిరా బేడి, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.