‘బ్యాడ్ బాయి’కి సాహో

19 August, 2019 - 8:54 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రం ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా మూడో పాట ‘బ్యాడ్ బాయి’ ను సోమవారం విడుదల చేశారు.  ఈ పాటలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్ ఆడిపాడారు.

యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతాన్ని అందించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంపై యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.