అరుంధతి మళ్లీ వస్తోంది

21 June, 2019 - 5:51 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ దర్శకత్వంలో స్వీటి అనుష్క ప్రధాన పాత్రలో మల్లెమాల ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం అరుంధతి. ఈ చిత్రం విడుదలై ఎంత ఘన విజయం సాధించిందిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో అరుంధతి, పశుపతి పాత్రలే హైలెట్. బొమ్మాళి నిను వదల అంటూ సోనూసూద్ చెప్పే డైలాగ్ ప్రతి ప్రేక్షకుడి మదిలో నిలిచిపోయింది.

అయితే ఈ చిత్రం సీక్వెల్‌గా ‘అరుంధతి 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత కోటి తూముల శుక్రవారం వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్ నటిస్తోందని …. గతంలో ఆమె ఆర్ఎక్స్ 100 చిత్రంలో నటించిందని ఆయన గుర్తు చేశారు.

ఈ చిత్రంలో నటించేందుకు ఇప్పటికే హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్… గుర్రపు స్వారీ, కత్తి యుద్ధానికి సంబంధించిన శిక్షణ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల వద్ద తీసుకుంటుందని చెప్పారు. ఈ చిత్రంలో కోలీవుడ్, బాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారని, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తామని కోటి తూముల చెప్పారు. శ్రీ శంఖు చక్ర ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.