దూసుకెళ్తున్న ‘రూలర్’

21 November, 2019 - 5:26 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం రూలర్. ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. అయితే ఈ చిత్ర టీజర్ గురువారం విడుదల చేశారు. ధర్మ మా ఊరికే గ్రామ దైవం.. ఎవరకి ఏ కష్టం వచ్చినా.. అతడే ముందుంటాడు అంటూ పలికే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతోంది.

1.15 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌లో బాలయ్య బాబు చెప్పే డైలాగ్‌లు ఆయన అభిమానులను బాగా అకట్టుకుంటున్నాయి. అందుకే ఈ చిత్ర టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే వ్యూస్ పరంగానే కాదు.. లైక్స్ పరంగా కూడా దూసుకు పోతుంది. కాగా ఈ చిత్రంలో బాలయ్య బాబు లూక్‌తో పాటు హెయిర్ స్టైల్‌ను సైతం పూర్తిగా మార్చివేశారు.

ఆయన లుక్ అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ఉంది. సీకే ఎంటర్ టైన్మెంట్స్ పతకాంపై సి. కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దాంతో బాలయ్య బాబు సినిమా విడుదల కోసం ఆయన ఫ్యాన్స్ తెగ ఎదురు చుస్తున్నారు.