స్వరాష్ట్రంలో రోహిత్ తొలి డకౌట్!

05 March, 2019 - 3:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నాగ్‌‌పూర్: టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తన స్వరాష్ట్రంలో తొలిసారిగా డకౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సీరీస్‌‌లో భాగంగా నాగ్‌పూర్‌ మంగళవారం జరుగుతున్న రెండో వన్డేలో ఈ సంఘటన జరిగింది. రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌‌కు దిగిన టీమిండియా మొదట్లోనే రోహిత్ కీలక వికెట్‌ కోల్పోయింది. మొదటి ఓవర్ ఆఖరి బంతికి క్యాచ్ ఇచ్చి రోహిత్ అవుట్ అయ్యాడు.

రోహిత్ శర్మ తన సొంత రాష్ట్రంలోని వీసీఏ (విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం) మైదానంలో డకౌట్ అవడం ఇదే తొలిసారి. నాగ్‌‌పూర్ వీసీఏ మైదానంలో గతంలో ఆస్ట్రేలియాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా గెలిచింది.