ఎన్టీఆర్ ‘ఎందుకు’?

08 January, 2019 - 4:29 PM

(న్యూవేవ్స్ డెస్క్)

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని మరో పాటను మంగళవారం విడుదల చేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అయితే ఈ పాట ఎందుకు అంటూ సాగుతోంది. ఈ పాటకు సంబంధించిన కొద్ది పాటి వీడియోను రామ్ గోపాల్ వర్మ ట్విట్లర్‌లో పోస్ట్ చేశారు.

అయితే ఇప్పటికే ఈ చిత్రంలోని వెన్నుపోటు సాంగ్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట అటు రాజకీయంగా, ఇటు సినిమా పరంగా భారీగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది. అయితే క్రిష్ దర్శకత్వంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారాక రామారావు… బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం విధితమే.

ఈ చిత్రం మొదటి భాగంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే రెండో భాగం మహానాయకుడు ఫిబ్రవరి 8న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం సంచలనం సృష్టించనుందని… టాలీవుడ్ పండితులు పేర్కొంటున్నారు.