మళ్లీ ఆర్జీవీ ‘పాట’

20 April, 2019 - 3:57 PM

On the eve of Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu ‘s birthday , I am releasing this first look of Telangana Chief Minister KCR ‘s biopic #TIGERKCR

Posted by RGV on Friday, April 19, 2019

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనం. తాజాగా ఆయన మరో సంచలనాన్ని సృష్టించేందుకు సమాయత్తమైయారు. అదే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించనున్న బయోపిక్.

ఈ సందర్భంగా వర్మ.. ఈ సినిమాలోని పాటను రాంగోపాల్ వర్మ పాడి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘‘మా భాష మీద నవ్వినావ్.. మా ముఖాల మీద ఊసినావ్.. మా బాడీల మీద నడిసినావ్ ఆంధ్రోడా.. వస్తున్నా.. వస్తున్నా నీ తాట తీయనీకి వస్తున్నా…’’ అంటూ పాడిన వీడియాను వర్మ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టైగర్ : కేసీఆర్ అనే టైటిల్‌ను వర్మ విడుదల చేశారు. అలాగే ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్.. సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. అలాగే బ్రిటిష్ ప్రభుత్వంపై శాంతియుతంగా పోరాడిన గాంధీ స్వతంత్ర భారత్‌ను సాధించారు. అగ్రెసివ్ గాంధీ కేసీఆర్ ఆంధ్ర పెత్తందారులపై పోరాడి తెలంగాణ సాధించుకున్నారని వర్మ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.