తిత్లీ తుపాన్: 8 మంది మృతి

11 October, 2018 - 5:07 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీకాకుళం: తిత్లీ తుపాన్ ఉత్తరాంధ్రను చిగురుటాకులా వణికించింది. ఈ తుపాను ధాటికి ఇప్పటి వరకు 8 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు శ్రీకాకుళం జిల్లా వాసులు కాగా… మరో ముగ్గురు విజయనగరం జిల్లాకు చెందిన వారని అధికారులు వెల్లడించారు.

అయితే మృతి చెందిన వారిలో ఆరుగురు సముద్రంలో వేటకు వెళ్లిన వారే అని అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు ఇల్లు కూలి, చెట్టు కూలి మరొకరు మరణించారని చెప్పారు. ఈ తుపాన్ గురువారం ఉదయం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద తీరాన్ని దాటింది.

తీరం దాటే సమయంలో పెనుగాలులు సృష్టించిన బీభత్సానికి వజ్రపుకొత్తూరు, సోంపేట మండలాల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈ తుపాన్ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మరికొన్ని రైళ్లను మరో మార్గంలో మళ్లించారు.