ప్రయాణాన్ని రద్దు చేసుకున్న పవన్

13 August, 2019 - 6:47 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌పై రాజోలు పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం సబబు కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అధికార వైయస్ఆర్ సీపీకి చెందిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .. జమీన్ రైతు పత్రిక సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్‌పై దాడి చేశారని… ఈ అంశంపై ఎమ్మెల్యే కోటంరెడ్డిని కనీసం పోలీస్ స్టేషన్‌కి కూడా పిలకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఆయనపై కనీసం విచారణ కూడా జరపలేదన్నారు.

ఇదేమీ నీతి అని ఏపీ ప్రభుత్వాన్ని జనసేనాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని ప్రభుత్వానికి పవన్ హితవు పలికారు. అన్యాయం జరిగిందని భావించినప్పుడు నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో మన హక్కు అని పవన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఈ నిరసన చట్టానికి ఆమోదయోగ్యంగా ఉండాలని…… ఉద్రిక్తతకు ఎవరు లోను కాకూడదని పవన్ ఈ సందర్భంగా జనసేన శ్రేణులకు సూచించారు.

రాజోల్ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్.. ఓ కిడ్నీ పేషెంట్‌ను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారని తెలుసుకున్నారు. ఆ క్రమంలో ఆయన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఎమ్మెల్యే వెంట అనుచరులు కూడా ఉన్నారు. అయితే కిడ్నీ పేషెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్సైకి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఎస్సై మాత్రం పట్టించుకోలేదు. దాంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కానీ జనసేన పార్టీ మిగత నాయకులు, కార్యకర్తలు అక్కడే ఉన్నారు. ఆ క్రమంలో ఎస్సై రామారావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన శ్రేణులు. ఎమ్మెల్యే రాపాకకు సమాచారం మిచ్చాయి. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు .. ఎమ్మెల్యేకి నచ్చ జెప్పి అక్కడి నుంచి పంపేశారు.

కాగా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారంటూ ఎమ్మెల్యేతో పాటు పలువురు పై పోలీసులు కేసు నమదు చేశారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ క్రమంలో ఆయన ఇంటికి వెళ్లగా .. ఆయన అక్కడ లేకపోవడంతో పోలీసులు వెనతిరిగారు. ఈ విషయం తెలిసి.. రాపాక.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి లోంగిపోయారు. ఆ తర్వాత ఆయన్ని పోలీసులు రాజోలు కోర్టులో హాజరుపరిచారు. అయితే ప్రజా ప్రతినిధుల కేసులకు సంబంధించిన కోర్టు విజయవాడలో ఉందని.. రాజోలు కోర్టులోని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్యే రాపాకకి స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని రాజోలు కోర్టు ఆదేశించింది. దాంతో పోలీసులు ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.

రాపాక అరెస్ట్ విషయం. రాజోలులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. రాజోలు వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. అంతేకాదు.. రాపాకపై పోలీసులు కేసు నమోదు చేసిన నాటి నుంచి.. అసలు ఏం జరిగిందని అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నారు.

ఆ తర్వాత పార్టీలోని సీనియర్లతో పాటు తూర్పు గోదావరి జిల్లా ఉన్నతాధికారులు పవన్ మాట్లాడారు. ఒకానొక సమయంలో పవన్ రాజోల్ వెళ్లేందుకు సమాయత్తమైయ్యారు. ఇంతలో ఎమ్మెల్యే రాపాకకు బెయిల్ మంజూరు కానుందని తెలుసుకుని.. పవన్ తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.

శ్రీ రాపాక వరప్రసాద్ పై కేసు సబబు కాదు

శ్రీ రాపాక వరప్రసాద్ పై కేసు సబబు కాదు. -#JanaSena Chief Pawan Kalyan

Posted by JanaSena Party on Tuesday, August 13, 2019