మరో 40 పైసలు తగ్గిన పెట్రోల్ ధర

09 June, 2018 - 12:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 11వ రోజు కూడా తగ్గాయి. గత 10 రోజులతో పొలిస్తే శనివారంనాడు ధరలు భారీగా తగ్గాయి. లీటర్ పెట్రోల్‌పై 40 పైసలు, డీజిల్‌పై 30 పైసలను తగ్గించినట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయి.

దీంతో హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.59కి, డీజిల్ ధర రూ. 74.22కి తగ్గింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.84కి, డీజిల్ ధర రూ. 75.20కి తగ్గింది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 77.02, ముంబైలో రూ. 84.84, కోల్‌కతాలో రూ. 79.68గా ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర ఢిల్లీలో రూ. 68.28, ముంబైలో రూ. 72.70, కోల్‌‌కతాలో రూ. 70.83, చెన్నైలో రూ. 72.08గా ఉంది. మొత్తం మీద ఈ పదకొండు రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 1.41, డీజిల్‌ ధర రూ. 1.03 తగ్గడం గమనార్హం.