రష్కిక లక్కీ ఛాన్స్

03 December, 2018 - 5:20 PM

(న్యూవేవ్స్ డెస్క్)

‘చలో’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి… గీత గోవిందం చిత్రంతో టాప్ రేంజ్‌లోకి దూసుకుపోయిన హీరోయిన్ రష్మిక. ఈ కన్నడ బ్యూటీకి వరసగా సినిమా చాన్సులు అందివస్తున్నాయి. హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్‌. ఈ చిత్రంలో రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గీత గోవిందం చిత్రం ఎంత విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.
అలాగే తాజాగా రష్మికకు మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టిసిందని ఫిలింనగర్‌లో టాక్ వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీలో సక్సెస్ మూవీ సిరిస్‌తో దూసుకుపోతున్న హీరో వరుణ్ తేజ్. ఆయన సరసన నటించే అవకాశాన్ని రష్మిక సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. తమళంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.