రష్మికకి బంపర్ ఆఫర్ !

04 September, 2019 - 8:01 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: రష్మిక మందన్న.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయినల్లో ఒకరు. ఛలో చిత్రంతో టాలీవుడ్‌లోకి ఇలా ఎంట్రీ ఇచ్చి.. అలా వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి. ఇప్పటికే తెలుగులో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ఆమె హిట్లు అందుకుంది. అలాగే ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్మిక.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి..  తన అదృష్టాన్ని అక్కడ కూడా పరీక్షించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

నేచురల్ స్టార్ నానీ, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం జెర్సీ. ఈ చిత్రం టాలీవుడ్‌లో ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రిమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలైనాయి. ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా షాహిద్ కపూర్‌ను ఇప్పటికే ఎంపిక చేశారు. అతడి సరసన కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని కరణ్ జోహార్ భావించారు.

ఆ క్రమంలో హీరోయిన్ కోసం ఆయన అన్వేషణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రష్మికతో కరణ్ జోహార్ భేటీ అయి చర్చించినట్లు తెలిసింది. ఈ రీమేక్ చిత్రంలో నటించేందుకు రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అందులోభాగంగా జెర్సీ సినిమాని రష్మిక పలు మార్లు చూసినట్లు తెలుస్తోంది.

తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబిర్ సింగ్‌గా రీమేక్ చేశారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రలో షాహిద్ కపూర్ ఓదిగిపోయి నటించారు. ఈ చిత్రంలో షాహిద్ సరసన కైరా అద్వానీ నటించారు. ఈ చిత్రం కూడా బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ సాధించింది. అంతేకాదు.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కనకవర్షం కురిపించింది. అలాగే షాహిద్ కపూర్ సరనస రష్మిక నటిస్తున్న ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ సాధిస్తుందనే టాక్ .. టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. రష్మిక బాలీవుడ్‌లో ఎంట్రీతో బంపర్ ఆఫర్ కొట్టేసిందంటూ ఫిలింనగర్‌లో వైరల్ అవుతోంది.