స్టైలిష్ స్టార్‌తో రోమాన్స్

12 July, 2019 - 6:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: శ్రీరామ్ వేణు దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఐకాన్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రాశీ ఖన్నాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌‌గా పలువురు పేర్లను పరిశీలించి చివరకు రాశీ ఖన్నా అయితే కరెక్ట్ అని చిత్ర యూనిట్ భావించిందట. ఆ క్రమంలో రాశీ ఖన్నాకి.. ఐకాన్ కథ చెప్పడం.. ఆ వెంటనే ఆమె ఓకే చేయడం అంతా చకచకా జరిగిపోయినాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ ప్రకటన చేయవలసి ఉంది.

కాగా ఈ చిత్ర షూటింగ్ అగస్టులో ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రోడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, దిల్ రాజు కాంబినేషన్‌లో ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాథం వచ్చాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రం ఐకాన్. అలాగే రాశీ ఖన్నా కూడా ప్రతి రోజు పండగే చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు.