రంగస్థలం ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

21 September, 2017 - 12:34 PM


రాంచరణ్, సమంత హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఈ పోస్టర్‌ను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పల్లెటూరి బ్యాగ్రౌండ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ ‌లుక్‌తో పాటు క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా వుండబోతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.