‘శర్వా’పై ప్రశంసలు

11 August, 2019 - 8:17 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్ : సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం రణరంగం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఈ చిత్ర సౌండ్ కట్‌ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో శర్వనంద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

రణరంగం చిత్రంలో శర్వానంద్ సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శిన్ నటిస్తున్నారు. ప్రశాంత్ ఫిళ్లై ఈ చిత్రానికి స్వరాలు అందించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆగస్ట్ 4వ తేదీన కాకినాడలో ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది.