అబ్బాయి సినిమాకి ‘క్లాప్’

15 June, 2019 - 4:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. ఈ సినిమా శనివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ హీరో వెంకటేష్ క్లాప్ కొట్టగా.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే వారం నుంచి రెగ్యూలర్‌గా జరుగుతుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.

తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, సిద్ధిపేటతోపాటు పలు గ్రామాలు, అలాగే ఏపీలోని పలు గ్రామాల్లో ఈ చిత్ర షూటింగ్ జరపుకోనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలాగే సురేష్ బెబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకురుస్తున్నారు. ప్రియమణి, టాబు, ఈశ్వరీ రావు, జరీనా వాహెబ్, సాయి చంద్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి మావోయిస్టులుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల వేణు ఉడుగుల దర్శకత్వంలో నీదీ నాది ఒకే కథ చిత్రం విడుదల అయింది. ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.