మళ్లీ రమ్యకృష్ణ

17 March, 2020 - 5:58 PM

(న్యూవేవ్స్ డెస్క్)

 ప్రముఖ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్య కృష్ణ నటిస్తోంది. పోలిటికల్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో నటిస్తుంది. అయితే ఈ పాత్ర ప్రతినాయకను పోలి ఉంటుందని తెలుస్తోంది. గతంలో రమ్యకృష్ణ.. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ చిత్రంలో ప్రతినాయక పాత్రలో ఓదిగిపోయి నటించిన సంగతి తెలిసిందే.

ఈ పాత్రకు రమ్యకృష్ణ అయితే సరిపోతుందని.. దర్శకుడు దేవ కట్టా ముందే భావించారు.. ఆ క్రమంలో ఈ చిత్ర కథలోని పాత్రను రమ్యకృష్ణకు వివరించారు.  ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటించేందుకు రమ్యకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మరోవైపు ప్రముఖ దర్శకుడు, రమ్యకృష్ణ భర్త కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రంగమార్తండ. ఈ చిత్రంలో ఆకాశ్ పూరి, కెతిక శర్మ జంటగా నటిస్తున్నారు. రోమాంటిక్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు.