‘హ‌లో గురు ప్రేమ కోస‌మే’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

15 May, 2018 - 12:35 PM

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `హ‌లో గురు ప్రేమ కోస‌మే`. ఇందులో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ హీరోయిన్‌‌గా న‌టిస్తోంది. విల‌క్షణ న‌టుడు ప్రకాశ్‌రాజ్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌‌లుక్‌‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్బంగా శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ అధినేత దిల్‌ రాజు మాట్లాడుతూ.. `ఎన‌ర్జిటిక్ రామ్‌‌ని స‌రికొత్త కోణంలో చూపే చిత్రం `హ‌లో గురు ప్రేమ కోస‌మే`. ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. జూన్ ఫ‌స్ట్ వీక్‌‌లో కాకినాడ‌, ప‌రిస‌ర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జ‌రుపుకోనుంది. దీని తర్వాత హైద‌రాబాద్‌‌లో కొంత పార్ట్ షూటింగ్‌ పూర్తిచేస్తాం. దీంతో చిత్రీక‌ర‌ణంతా పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. `సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్` వంటి వ‌రుస విజ‌యాల త‌ర్వాత త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అవుట్‌‌పుట్ చాలా బాగా వ‌స్తోంది. త‌ప్పకుండా మా బ్యాన‌ర్‌‌లో ప్రేక్షకుల‌ను అల‌రించేలా ఈ చిత్రం ఉంటుందన‌డంలో సందేహం లేదు` అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజ‌య్ కె.చ‌క్రవ‌ర్తి, ఆర్ట్‌: సాహి సురేశ్‌, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, మాట‌లు: బెజ‌వాడ ప్రస‌న్నకుమార్‌, ర‌చ‌నా స‌హ‌కారం: సాయికృష్ణ.