‘శంకర్’పై నిథి ట్విట్

26 May, 2019 - 2:47 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ , నిథి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ఐ స్మార్ట్ శంకర్. ఈ చిత్రం విడుదల తేదీతోపాటు పోస్టర్‌ను సైతం ఈ చిత్ర హీరోయిన్ నిథి అగర్వాల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

ఈ చిత్రం ప్రోడక్షన్ వర్క్స్‌తోపాటు పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి అయినాయని.. మిస్టర్ డబుల్ దిమాక్ హైదరాబాదీని జులై 12న థియేటర్లలో కలుసుకోండి అంటూ ఆమె ట్విట్ చేశారు. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం పూరీ జగన్నాథ్ వహించారు. ఈ చిత్రంలో బ్రహ్మనందం, అశీష్ విద్యార్థి, తనికెళ్ల భరణి, షియాజీ షిండే, రావు రమేష్, పవిత్రా లోకేశ్, అజీజ్ నాజర్ నటించారు.