నాగ్- ఆర్జీవీ ‘ఆఫీసర్’ ట్రైలర్ రిలీజ్

12 May, 2018 - 2:51 PM

వరుస డిజాస్టర్లతో కెరీర్‌‌ను కష్టాల్లోకి నెట్టేసుకున్న వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, సీనియర్‌ హీరోగా నాగార్జున లీడ్‌ రోల్‌‌లో తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆఫీసర్‌’. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్నారు. వర్మ స్టైల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మైరా సరీన్‌ హీరోయిన్‌‌గా పరిచయం అవుతోంది.

ఆఫీసర్ మూవీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్‌‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేశారు. ‘ప్రతి మనిషిలో ఒక దేవుడు, రాక్షసుడు ఇద్దరూ ఉంటారు’ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఇప్పటికే రెండు టీజర్‌‌లను రిలీజ్‌ చేసిన యూనిట్‌ తాజాగా రెండు నిమిషాల నిడివితో ట్రైలర్‌‌ను రిలీజ్‌ చేసింది.వర్మ మార్క్‌ యాక్షన్‌‌తో రూపొందించిన ఈ ట్రైలర్‌‌లో నాగార్జున్‌ స్టైలిష్ కాప్‌‌గా ఆకట్టుకున్నాడు. వర్మ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మే 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.