రామ్ చరణ్‌కి గిఫ్ట్

23 April, 2019 - 5:52 PM

(న్యూవేవ్స్ డెస్క్)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ జన్మదినం మార్చి 27వ తేదీ. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌కు జపాన్ అభిమానుల నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ అందింది. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ జపాన్ నుంచి ఆయన అభిమానులు బర్త్ డే గిఫ్ట్స్ పంపారు.

చెర్రీ నటించిన మగధీర చిత్రంలోని పాత్రలను ఈ గ్రీటింగ్ కార్డులపై చిత్రించి పంపారు. ఈ గ్రీటింగ్ కార్డులను రామ్ చరణ్.. తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి.. వారికి థ్యాంక్స్ తెలిపారు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఈ సందర్భంగా రామ్ చరణ్ పేర్కొన్నారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మగధీర. ఈచిత్రంలో రామ్ చరణ్, కాజల్ జంటగా నటించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం జపాన్‌లో కూడా విడుదలైంది. అక్కడ కూడా ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమైన సంగతి తెలిసిందే.