మాస్‌ లుక్‌లో రామ్ చరణ్

06 November, 2018 - 1:47 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ దీపావళి సందర్భంగా మంగళవారం విడుదల చేశారు.

ముందుగా అనుకున్నట్లే ఈ చిత్రానికి వినయ విధేయ రామ అనే టైటిల్‌ ఖరారు చేశారు. లుక్‌లో చరణ్ మాస్ లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నవంబర్ 9 విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరనస కియారా ఆద్వాణీ నటించారు.

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఈ చిత్రంలో విలన్ పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇందులో రామ్‌చరణ్‌ కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో నటించనున్న విషయం విదితమే. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.