రాజ్‌నాథ్ సింగ్ సిరియస్

18 April, 2019 - 3:27 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ గురువారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా డార్జిలింగ్‌లో దుండగులు పెట్రోల్ బాంబులతో దాడికి దిగారు. ఆ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు.

దాంతో స్థానికంగా గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో చోటు చేసుకున్న ఘటనపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.. సిరియస్ అయ్యారు. ప్రత్యేక బలగాలను హుటాహుటిన బెంగాల్ పంపాలని ఆయన అదేశించారు.