‘క్లారిటీ లేదు’

10 January, 2019 - 9:06 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో పొత్తుపై ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అయితే ఏపీలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తుపై నిర్ణయం మాత్రం జనవరి 20లోపు తెలుస్తుందన్నారు. పొత్తులపై నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తామని అధిష్ఠానం పేర్కొందన్నారు. గురువారం న్యూఢిల్లీలో రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది.

ఈ సమావేశ అనంతరం ఏపీ పీసీసీ చీప్ ఎన్ రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ…  సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని కోరు కమిటీ సూచించిందన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థులను కూడా ఖరారు చేయాలని అధిష్టానం ఈ సమావేశంలో నిర్ణయించిందన్నారు. బూత్ స్థాయి నుంచి అన్ని కమిటీలను త్వరతిగతిన ననియమించాలని అధిష్టానం ఆదేశించిందని రఘువీరా తెలిపారు.