ట్రైలర్‌లో ‘వెంకయ్యనాయుడు’

09 November, 2019 - 6:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రఘుపతి వెంకయ్యనాయుడు’. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా ఈ చిత్ర థిరిటికల్ ట్రైలర్‌ను ప్రిన్స్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై సతీష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి బాబ్జీ దర్శకత్వం వహించారు. నవంబర్ 29న ఈ రఘుపతి వెంకయ్యనాయుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మహర్షి రాఘవ, ముని చంద్ర, సత్యప్రియ, భావన, అఖిల్, గెడ్డయ్య, సాయి కాంత్, దేవరాజ్, చక్రపాణి, వాహిని, తనికెళ్ల భరణి, తారా సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ వెంకట్ సంగీతం అందిస్తున్నారు.