‘బిగ్ బాస్’లో రాశి, నివేదాల సందడి

16 September, 2017 - 1:14 PM

తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో ఇంటి సభ్యుల ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ప్రతివారం విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన పలువురు తారలు వారి వారి సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూ అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రానా, విజయ్, సచిన్ జోషి, తాప్సీ, సునీల్ తదితరులు ఈ హౌస్‌లో పాల్గొని సందడి చేసారు. అయితే ఇపుడు ‘జై లవకుశ’ వంతు కానుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఈసారి ‘జైలవకుశ’ను ప్రమోట్ చేయడానికి ఇద్దరు అందమైన భామలు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో తారక్ సరసన నటించిన రాశిఖన్నా, నివేదా థామస్‌లు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నారు. నివేదాతో కలిసి బిగ్ బాస్‌లోకి వెళ్లబోతుండటం చాలా ఎక్సైటింగ్‌గా వుందంటూ రాశిఖన్నా ఓ ఫోటోను తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

మరి రాశిఖన్నా, నివేదాలు అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారో.. మరి వారికి తోడుగా ‘జై లవకుశ’ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో అనే విషయం చూడాలి. ఎన్టీఆర్ మూడు పాత్రలలో నటించిన ‘జై లవకుశ’ చిత్రం సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.