దివాళ దిశగా ‘ఏపీ’

22 August, 2019 - 6:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రద్దుల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆరోపించారు. ప్రత్యామ్నాయా వ్యవస్థ చూడకుండానే వైయస్ జగన్ ప్రభుత్వం ప్రతిదీ రద్దు చేస్తుందని ఆయన విమర్శించారు. ఇసుకను రద్దు చేసి.. ప్రత్నామ్యాయం చూపక పోవడం వల్ల భవన నిర్మాణ కార్మికుడు .. గత మూడు నెలలుగా .. ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు నెలల్లో జీఎస్టీ వసూల్ చాలా దారుణంగా పడిపోయిన పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మార్కెట్లు అన్ని స్తబ్ధుగా ఉన్నా పరిస్థితి నెలకొందన్నారు. గత రెండు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ దివాళ దిశగా పయనిస్తుందని ఆయన పేర్కొన్నారు.