నెక్ట్స్ ‘ఫైటర్’

22 August, 2019 - 9:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనుల్లో దర్శకుడు పూరి జగన్నాథ్ బిజీ బిజీగా ఉన్నారు.

పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కలెక్ట్స్ బ్యానర్‌పై పూరీ, హీరియిన్ ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా పూరీ, ఛార్మీ తెరకెక్కించిన ఐ స్మార్ట్ శంకర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం దర్శకుడు కాంత్రి మాధవ్, అలాగే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాల్లో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ చిత్రాల షూటింగ్ పూర్తి కాగానే విజయ్ దేవరకొండ.. దర్శకుడు పూరీ చిత్రంలో నటించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసేందుకు పూరి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.