పాట టీజర్‌కి ‘సాహో’

05 July, 2019 - 3:12 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో తొలి పాట తాలుక టీజర్ శుక్రవారం విడుదల చేశారు. సైకో సయ్యాన్ పాటలో ప్రభాస్ మంచి హెండె‌సమ్‌గా కనిపిస్తే… శ్రద్ధా కపూర్ తన అందచందాలతోపాటు అభినయంతో ఆ కట్టుకుంది. ఈ పూర్తి పాటను జులై 8 అంటే సోమవారం విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే అరుణ్ విజయ్, చుంకీ పాండే, జాకీ షరాఫ్, ముఖేష్ మంజ్రేకర్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.