టాలీవుడ్ నిర్మాత మృతి

12 May, 2019 - 6:52 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయా సంస్థల అధినేత బి. నాగిరెడ్డి కుమారుడు బి.వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు.

ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయా సంస్థల బ్యానర్‌పై వెంకట్రామిరెడ్డి తెలుగులో శ్రీకృష్ణార్జునవిజయం, బృందావనం, భైరవ ద్వీపం చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో కూడా ధనుష్, విజయ్, అజిత్ తదితర హీరోలతో మంచి సినిమాలను నిర్మించారు.

నిర్మాతలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా తన తండ్రి నాగిరెడ్డి పేరిట పురస్కారాలను వెంకట్రామిరెడ్డి అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.