‘ఖైదీల మరణాలు తగ్గాయి’

10 January, 2019 - 2:37 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఖైదీల మరణాలు పూర్తిగా తగ్గాయని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది కేవలం 8 మంది మాత్రమే చనిపోయారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో వీకే సింగ్ మాట్లాడుతూ…. అవినీతి రహిత శాఖగా జైళ్లశాఖను మార్చామని చెప్పారు. 2018 ఏడాదిలో తెలంగాణ జైళ్ల శాఖ ద్వారా రూ. 17 కోట్ల లాభం వచ్చిందని గుర్తు చేశారు.