ప్రేమకథా చిత్రమ్ 2 ట్రైలర్ ఇదే

08 March, 2019 - 3:44 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సుధీర్, నందిత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ప్రేమకథ చిత్రం. 2013లో విడుదలైన ఈ చిత్రం సస్పెన్స్, కామెడీని పండించి బాక్సాపీస్ వద్ద కనకవర్షం కురిపించింది. అయితే ఈ చిత్ర సీక్వెల్‌గా ప్రేమ కథ చిత్రమ్ 2గా తెరకెక్కుతుంది. సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

కాగా ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర యూనిట్ శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి జీవన్ బాబు స్వరాలు సమకూరుస్తున్నారు.

ఆర్‌పీఏ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి హరి కిషన్ దర్శకత్వం వహిస్తుండగా… సుదర్శన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.