‘ప్రేమ అంత ఈజీ కాదు’ మూవీ రివ్యూ

29 March, 2019 - 8:33 PM

నటీనటులు : రాజేష్ కుమార్, ప్రజ్వల్, శ్రీధర్ 

సంగీతం : జై యం 

నిర్మాతలు : శ్రీధర్, నరేష్, అంజయ్య 

దర్శకత్వం : ఈశ్వర్ 

రేటింగ్ :3 /5

రాజేష్ కుమార్ – ప్రజ్వాల్ జంటగా ఈశ్వర్ దర్శకత్వంలో అంజయ్య , శ్రీధర్, నరేష్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ”ప్రేమ అంత ఈజీ కాదు”. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దామా!

కథ :

కార్తీక్ (రాజేష్ కుమార్) ప్రేమ (ప్రజ్వల్)ని ప్రేమిస్తుంటాడు. అయితే ప్రజ్వల్ కూడా కార్తీక్‌ని ప్రేమిస్తుంది కానీ ఆ విషయాన్నీ ఎప్పుడూ కార్తీక్ కు చెప్పదు. ప్రేమ ప్రేమ కోసం కార్తీక్ తపించి పోతుంటాడు. తన ఇంట్లోనే ప్రేమ ఉన్నప్పటికీ ఆమెకు దూరంగా తండ్రితో విభేదించి ఫ్రెండ్స్ దగ్గర ఉంటాడు. అయితే తను రూపొందించిన  ఆల్బమ్‌ని ప్రేమకు చూపించడంతో ప్రేమ కార్తీక్ కు దూరం అవుతుంది. అసలు కార్తీక్ రూపొందించిన ఆల్బమ్‍‌లో ఏముంది? ప్రేమ అతడ్ని ఎందుకు దూరం పెట్టింది? చివరకు ఈ ఇద్దరూ ఒక్కటయ్యారా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలెట్స్ : 

స్వచ్ఛమైన ప్రేమ

డ్రా బ్యాక్స్ : 

కొన్ని విజువల్స్

నటీనటుల పర్ఫార్మెన్స్ :

కార్తీక్ పాత్రలో బాగా రాణించాడు రాజేష్ కుమార్. నటనలోనే కాకుండా యాక్షన్ సీన్స్‌లలో కూడా మెప్పించాడు. డ్యాన్స్ , ఫైట్స్‌లలో కూడా సత్తా చాటాడు. ప్రేమ పాత్రలో ప్రజ్వల్ మెప్పించింది. తనకు నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించడంతో తన అభినయంతో ఆకట్టుకుంది. ఇక బాస్ పాత్రలో శ్రీధర్ కూడా మెప్పించాడు. నరేష్ తో పాటుగా హీరో ఫ్రెండ్స్ కూడా ఆకట్టుకున్నారు. ఇక జబర్దస్త్ బ్యాచ్ ధన్ రాజ్, అవినాష్, ఆటో రాంప్రసాద్ తమ కామెడీ టైమింగ్‌తో హాయిగా నవ్వించారు.

సాంకేతిక వర్గం :

పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు అంజయ్య , శ్రీధర్, నరేశ్. మొదటి సినిమాతోనే మంచి అభిరుచి ఉన్న నిర్మాతలుగా నిరూపించుకున్నారు . డబ్బుల కోసం అశ్లీల చిత్రాలను ఎంచుకోకుండా స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రాన్ని ఎంచుకున్నారు. జై ఎం అందించిన పాటల్లో మూడు పాటలు వినడానికి, చూడడానికీ బాగున్నాయి. అలాగే నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు. విజువల్స్ అక్కడక్కడా ఇబ్బంది పెట్టాయి . ఇక దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది, అయితే స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరింత బాగుండేది.

ఓవరాల్‌గా : ‘ప్రేమ అంత ఈజీ కాదు’ అలరించే ప్రేమకథాచిత్రం.