పెళ్లి పనులు షూరు

15 February, 2020 - 7:28 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హీరో నితిన్ త్వరలో శాలినితో కలసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అందుకు సంబంధించిన పెళ్లి పనులు శనివారం ప్రారంభమైనాయి. ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన ప్రముఖ పల్లోజో వెర్సెస్ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది. అయితే నితిన్ , శాలినీల పెళ్లి ప్రారంభం పనులకు సంబంధించన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటీనటులు, నితిన్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపుతున్నారు.

నితిన్‌‌కు కాబోయే భార్య శాలిని ఎంబీఏ చదివింది. తెలంగాణలోని సంప్రదాయ కుటుంబానికి చెందిన శాలిని.. నితిన్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వారి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఏప్రిల్ 16న దుబాయిలో  పెళ్లిపీటలు ఎక్కనున్నారు. నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక నటించింది. అలాగే చంద్రశేఖర్ యేలేటి, వెంకీ అట్లూరి, కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాల్లో నితిన్ హీరోగా నటిస్తున్నారు.