ట్రైలర్‌లో ‘ప్రతి రోజూ పండగే’

05 December, 2019 - 1:33 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు డి. మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్న జంటగా నటించిన చిత్రం ప్రతి రోజూ పండగే. ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర యూనిట్ బుధవారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో సత్యరాజ్ తాతయ్య పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఆయన లంగ్ కేన్సర్‌.. అది కూడా ఫైనల్ స్టేజ్.. దీంతో ఆయన మనవడి పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించారు.

ఈ ట్రైలర్‌లో పల్లెటూరు సన్నివేశాలు అధికంగా ఉన్నాయి. ఈ చిత్రంలో రావు రమేశ్, ప్రభ, హరి తేజ, సత్యరాజ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.